క్రైమ్/లీగల్

సిఐడి పర్యవేక్షణలో ఏపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ సత్ఫలితాలిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 8: ఎన్‌ఆర్‌ఐల సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఆర్‌ఐ సెల్ సత్ఫలితాలిస్తోందని డీజీపీ ఆర్‌పి ఠాకూర్ అన్నారు. ఏపీ సిఐడి పర్యవేక్షణలో గడిచిన నాలుగు నెలల వ్యవధిలో ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుల మేరకు 121 కేసులు నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీజీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ పనితీరును సమీక్షించారు. ఈసందర్భంగా ఎన్‌ఆర్‌ఐ, సిఐడి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్ధితి ఉండేదని, ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ గత ఏడాది 2018 సెప్టెంబర్‌లో ఏపీ సిఐడి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిఐడి సిఐడి అదనపు డీజీ అమిత్‌గార్గ్ మట్లాడుతూ విదేశాల్లో ఉంటున్న రాష్ట్రానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ సమస్యలు పరిష్కారం కోసం ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను ఆశ్రయిస్తున్నారని అన్నారు. 2018 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది 2019 జనవరి వరకు ఎన్‌ఆర్‌ఐల నుంచి వచ్చిన 121 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వీటిలో 47 చీటింగ్ కేసులు, 20 వివాహ సంబంధ వివాదాలు, వీసా, ఇమ్మిగ్రేషన్, ఆర్ధిక, సోషల్ మీడియా తదితర వివాదాలకు సంబంధించి మరో 54 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిలో యుఎస్‌ఏకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు 49మంది, యుకేకు 3, మిడిల్ ఈస్ట్ 35, సౌత్ ఆసియా 10, ఆఫ్రికా 4, ఆస్ట్రేలియా 1, ఇతర దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు 19 ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ కేసులు పరిష్కరించడంలో వారి నుంచి ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు సానుకూల స్పందన వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాన్ రెసిడెంట్ తెలుగు (ఎన్‌ఆర్‌టి) అధ్యక్షుడు వేమూరి రవి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.