క్రైమ్/లీగల్

‘అగ్రిగోల్డ్’ చెల్లింపులకు హైకోర్టు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 8: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి అనుమతి లభించింది. పదివేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించి, ఈ చెల్లింపులకు 250కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పదివేల లోపు డిపాజిట్లు కలిగిన బాధితులు 3.5లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. కాగా.. అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం వాయిదా సందర్భంగా కేసు విచారణకు వచ్చింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. బాధితులకు పరిహారం పంపిణీకి అనుమతి ఇచ్చింది. జిల్లా కమిటీల ద్వారా పరిహారం పంపిణీ చేయాలని, ఆయా జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్‌గా, ఏర్పాటయ్యే కమిటీలో జిల్లా జడ్జి, ఎస్పీ, రిజిస్ట్రార్‌లు సభ్యులుగా ఉండాలని, మార్చి 6వ తేదీ నుంచి జిల్లాలో బాధితులు తమ వద్ద ఉన్న బాండ్లను కమిటీకి సమర్పించాలని, సమర్పించిన బాండ్లనుము 11వ తేదీ నుంచి 20వరకు పరిశీలన పూర్తి చేసిన మీదట 20వ తేదీ నుంచి పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు సూచించింది. దీంతో హైకోర్టు నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేయగా, ప్రతి కస్టమర్ 20వ తేదీలోగా తమ ఒరిజినల్ బాండ్లతో జిల్లా కమిటీల వద్ద పేరు నమోదు చేయించుకోవాలని ఈసందర్భంగా అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. హాయ్‌ల్యాండ్ ఆస్తులను వేలం వేయాలని కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. హాయ్‌ల్యాండ్ ఆస్తులను 653 కోట్ల రూపాయలు విలువగా నిర్ధారించిన మీదట వేలం వేసేందుకు గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పటి వరకు ఒక్క బిడ్ కూడా వేయకపోవడంతో హాయ్‌ల్యాండ్ ఆస్తులను 500 కోట్లకు తగ్గించి వేలానికి నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.