క్రైమ్/లీగల్

15న హాజరుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సస్పెన్షన్ ఎత్తివేత కేసులో హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయలేదన్న అభియోగంపై శాసనసభ కార్యదర్శి వేదాంతాచారి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావుకు బెయిలబుల్ వారెంట్‌ను శుక్రవారం హైకోర్టు జారీ చేసింది. ఈ నెల 15న వీరిద్దరు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పట్ల కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ అనుచితంగా వ్యవహరించారన్న అభియోగంపై వారి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాము ఎవరిపై దాడి చేయలేదని, అనుచితంగా ప్రవర్తించలేదని కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభ వీడియో పుటేజీలను పరిశీలించి తమపై చర్య తీసుకోవాలని వారు హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారి సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పు చెబుతూ సభ్యత్వాలను పునరుద్ధరించాల్సిందిగా శాసనసభ కార్యదర్శిని, న్యాయశాఖ కార్యదర్శిని ఆదేశించింది. అలాగే కార్యదర్శులు ఇద్దరిని కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును అమలు చేయలేదని, కార్యదర్శులు కోర్టుకు హాజరు కాకుండా ధిక్కారానికి పాల్పడ్డారని పిటిషన్‌దారులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు శుక్రవారం తిరిగి విచారణకు రాగా శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదివేల వ్యక్తిగత పూచికత్తుతో కూడిన బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ఈ నెల 15న అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిని కోర్టులో హాజరు పర్చాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించినట్టు కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ గాంధీభవన్‌లో
మీడియాకు వివరించారు. శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని బెయిలబుల్ వారెంట్ జారీ కావడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక తీర్పుగా జంధ్యాల రవిశంకర్ అభివర్ణించారు.