క్రైమ్/లీగల్

జయరాం హత్యకేసులో దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఎక్స్‌ప్రెస్ చానల్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం నాడు న్యాయవాదుల సమక్షంలో పోలీసులు రెండు గంటల పాటు పద్మశ్రీని విచారించారు. విచారణను బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావునేతృత్వంలో విచారణ సాగింది. జయరాం హత్యలో తనకు ఎన్నో అనుమానాలున్నాయని ఆయన సతీమణి పద్మశ్రీ పోలీసులకు వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. తన భర్తది ఎవరు అడిగినా సాయం చేసే తత్వమని ఆమె చెప్పారు. జయరాంపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని పద్మశ్రీ ఖండించారు. తన భర్త హత్యలో పెద్ద కుట్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మేనకోడలు శిఖా చౌదరినే తన భర్త హత్యలో కీలక సూత్రధారి అని ఆరోపించారు. రెండు గంటల విచారణ అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులు జయరాం కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఏసీపీ అన్నారు.