క్రైమ్/లీగల్

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల్ల పేరిట మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 8: నిరుపేదలైన కుంటుబాలకు రెండు పడకల గదులు ఇవ్వాలని ప్రభుత్వ కృషి చేస్తుంటే అమాయక ప్రజలను కొందరు దళారులు మోసం చేస్తు పబ్బం గుడుపుకుంటున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని రెండు పడకల ఇళ్లు ఇప్పిస్తామని 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. పేదలను మోసం చేస్తున్న ఘరాన నిందితుడిని మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు 8.55లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దువురూ గ్రామానికి చెందిన కూనంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లా పటాన్‌చెరువులో నివాసముంటున్నాడు. ఎంఏ, ఎకానామిక్స్ పూర్తి చేయడంతో పాటు బెంగళూరు యూనివర్సీటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నాడు. తనకు సర్వే ఆఫ్ ఇండియాలోని అధికారులతో పరిచయాలు ఉన్నాయని, డబుల్ బెడ్‌రూమ్‌కు చెందిన దరఖాస్తులన్ని అక్కడే పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ప్రజలను నమ్మించాడు. బలహీన వర్గల కాలనీలల్లో తిరుగుతూ అమాయక ప్రజల నుంచి అందినంత దండుకున్నాడు. లబ్దిదారులకు ఎలాంటి అనుమానం రాకుండా బాధితుల నుంచి మూడు ఫొటోలు, 20 రూపాయల స్టాంపు పేపర్లు, ఆధార్‌కార్డులతోపాటు రూ.15 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేశాడు. లబ్దిదారులకు అనుమానం రాకుండా తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫడవిట్ కూడా తీసుకునే వాడని సీపీ చెప్పారు.
చందానగర్, ఆర్‌సీపురం, మాదాపూర్, దుందిగల్ పోలీసు స్టేషన్‌లలో 25 మంది వరకు బాధితులు ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు. ప్రభుత్వ పథకాల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ఎవరూ ఇలాంటి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సీపీ వివరించారు. దరఖాస్తులను కలెక్టర్ కార్యాయలం నుంచి స్థానిక తహశీల్దార్ ద్వారా ఎంపిక జరుగుతుందని చెప్పారు. లబ్దిదారులు ఎక్కువ ఉంటే లాటరీతో ఎంపిక చేస్తారని కమిషనర్ సజ్జనార్ వివరించారు. ఎస్‌ఓటీ ఏడీసీపీ దయానంద్ రెడ్డి, సీఐలు పురుషోత్తం, విజయ్ కుమార్, ఎస్‌ఐ రాజేందర్ పాల్గొన్నారు.