క్రైమ్/లీగల్

తిరుమలలో త్రిదండి చిన్న జీయర్ మఠం నిర్మాణంలో కూలిన బండరాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 9: తిరుమలలోని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి నూతన మఠం నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో నిర్వాహకుల అజాగ్రత్త ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొన్న సంఘటన శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న త్రిదండి చిన్న జీయర్ మఠానికి చెందిన పాత భవనాన్ని తొలగించి అక్కడే నూతన భవన నిర్మాణం చేపట్టారు. శనివారం సెల్లార్‌లో కాంక్రీట్ పనులను చేస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్లాబ్ వేస్తుండగా భవన నిర్మాణం పనులు జరుగుతున్న చోట కొండ అడుగు భాగాన్ని తీసివేశారు. దీంతో ఒక్కసారిగా మట్టి పెళ్లలు, బండరాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో అక్కడే పనులు చేస్తున్న విజయవాడకు చెందిన సూరీ (25)పై పడ్డాయి. దీంతో సూరి వాటి కింద కూరుకుపోయాడు. సుమారు 20 మంది ఆ బండరాళ్లను తొలగించడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అశ్విని ఆస్పత్రి సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సుమారు నలుగురు కూలీలు కొండ మట్టి, బండరాళ్ల కింద చిక్కుకున్నట్లు భావించారు. అయితే అక్కడే ఉన్న నారాయణ అనే వ్యక్తిపై బండరాళ్లు పడటంతో అతని రెండు కాళ్ల విరిగాయి. మరో ముగ్గురు కూలీలు త్రుటిలో తప్పించుకున్నారు. అయితే సూరీ మాత్రం బండరాళ్ల కింద చిక్కుకుపోయాడు. ఆ బండను తొలగించడానికి దాదాపు అరగంట పట్టింది. అయితే అప్పటికే సూరీ ఊపిరాడక మరణించాడు. ఈ ప్రమాదానికి కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని కూలీలు ఆరోపిస్తున్నారు.

చిత్రం.. కూలీ మృతదేహాన్ని వెలికి తీస్తున్న దృశ్యం