క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మరో అవినీతి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 9: ఏసీబీ వలలో మరో అవినీతి చేప పడింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సాయినగర్‌లో నివాసముండే బాలాజీ గుప్త డెంటల్ డాక్టర్. దత్తాత్రేయ నగర్‌లో ఓ పాత ఇల్లు ఉంది. ఈ ఇంటికి పన్ను అధికంగా వస్తుందని, తగ్గించి పన్నును విధిస్తామని కుత్బుల్లాపూర్ సర్కిల్ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మన్జూర్ అహ్మద్, అతని అసిస్టెంట్ యాకుబ్ బాలాజీ గుప్తకు చెప్పారు. లంచం ఇస్తే పన్ను తగ్గిస్తామని వేధించ సాగారు. వారం రోజుల క్రితం బాలాజీ గుప్త ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు శనివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో మన్జూర్ అహ్మద్ అసిస్టెంట్ యాకుబ్ రూ.10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పాటు మలక్‌పేట్‌లోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మన్జూర్ ఇంట్లో పట్టుకుని అరెస్ట్ చేశారు.