క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 9: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ బీరప్పగడ్డలో నివసిస్తున్న పీ.దశరథ గౌడ్ (65) ప్రైవేటు ఉద్యోగి. అతడు శనివారం ఉదయం పారిశ్రామిక వాడలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు వేగంగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది. కింద పడిన అతనిపై వెనుకనే వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన దశరథను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పెంటయ్య తెలిపారు.