క్రైమ్/లీగల్

బస్సు కింద పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఫిబ్రవరి 9: స్థానిక మండల పరిధిలోని రామకోటిపురం గ్రామానికి చెందిన బొప్పన సుబ్రహ్మణ్యం కుమారుడు బొప్పన కల్యాణ్‌బాబు(14) శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందాడు. స్థానిక శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కల్యాణ్ బాబు తన పెదనాన్న బొప్పన వెంకటేశ్వరరావుతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రామకోటిపురం నుండి అవనిగడ్డకు మోటారు సైకిల్‌పై వస్తుండగా అవనిగడ్డ రాజీవ్ గాంధీ చౌక్ సమీపంలో పులిగడ్డ వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. కింద పడిపోయిన కల్యాణ్ బాబుకు ముక్కు, చెవి నుండి రక్తం కారటంతో పక్కనే ఉన్న ప్రజలు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో మార్గమధ్యంలో కల్యాణ్ బాబు మృతి చెందాడు. సుబ్రహ్మణ్యంకు భార్య లేకపోవటంతో కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. స్పృహ కోల్పోయి దెబ్బలతో ఆసుపత్రిలో ఉన్న కొడుకును చూసి బోరున విలపించాడు. వైకాపా నేత సింహాద్రి రమేష్‌బాబు తదితరులు పరామర్శించారు.