క్రైమ్/లీగల్

సూర్య కోసం పోలీసులు వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమికుడు సూర్యచౌదరే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయినట్లు తెలిసింది. సూర్యచౌదరి అలియాస్ నాని కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సూర్య విజయవాడలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆత్మహత్యకు ముందు ఝాన్సీ జరిపిన వాట్సాప్‌చాటింగ్, మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పంజాగుట్ట ఏసీపీ విజయకుమార్ వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ రాసిన మరణ వాగ్మూలంలోని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సూర్యచౌదరితో వాట్సాప్‌లో పంపిన సమాచారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ ఆత్మహత్యకు సూర్యచౌదరి కారణమని ఆమె కుటుంబ సభ్యులు శనివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడు సూర్య వేధింపులే ఆత్మహత్యకు కారణమయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఝాన్సీ ఇంట్లో సోదాలు చేపట్టడంతో అనేక విషయాలు బయట పడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

నాగ ఝాన్సీ (ఫైల్‌పొటో)