క్రైమ్/లీగల్

టీఆర్‌ఎస్ ర్యాలీలో డ్రోన్ కెమెరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 10: బోడుప్పల్ చౌరస్తాలో ఆదివారం టీఆర్‌ఎస్ బహిరంగ సభ జరిగింది. స్థానిక టీడీపీ, కాంగ్రెస్ ఎంపీటీసీలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాలను వీడియో ద్వారా కవర్ చేయడానికి చౌరస్తాలో సభ, ర్యాలీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన నిషేద డ్రోన్ కెమెరా ప్రత్యక్షమైంది. కోర్టు ఆదేశాల ప్రకారం డ్రోన్ కెమెరా వాడటం నిషేధం. ఎలాంటి అనుమతి లేకుండా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార టీఆర్‌ఎస్ నాయకులు అత్యుత్సాహంతో వినియోగించిన డ్రోన్ కెమెరా పెట్టిన విషయం సోషల్ మీడియాలో వైరలైంది. స్పందించిన మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి సుమోటో కింద సభ, ర్యాలీ నిర్వాహకులు, వీడియో తీసిన వారిపై వైలేషన్ ఆఫ్ ది రూల్స్ కింద ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అంజి రెడ్డి పేర్కొన్నారు.