క్రైమ్/లీగల్

పంజాగుట్ట పోలీసులకు లొంగిపోయిన సూర్యతేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 10: బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సూర్యతేజ పంజాగుట్ట పోలీసులకు శనివారం అర్ధరాత్రి లొంగిపోయాడు. సూర్యతేజను పట్టుకోవడానికి శనివారం పోలీస్ బృందాలు ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే అతనే స్వయంగా పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. నటి ఝాన్సీ ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడకు చెందిన సూర్యతేజ పలు ఆశక్తికర వివరాలును పోలీసులుకు వివరించినట్లు తెల్సింది. నటి ఝాన్సీ పరిచయానికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలను సూర్యతేజ పూసగుచ్చినట్లు పోలీసులుకు వెల్లడించారు. నటి ఝాన్సీ ఆత్మహత్యకు ముందు సూర్యతేజకు వాట్సప్‌లో పంపిన సమాచారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నాగార్జున నగర్‌కాలనీలోని తన గదిలో ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. వ్యాపారి సూర్యతేజ వేధింపుల కారణంగా తన సోదరి ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నటన మానివేయాలని, ఇతరులతో సన్నిహితంగా ఉంటున్నావని తీవ్రంగా వేధించడం వల్లే తన సోదరి మృతి చెందిందని తల్లి సువర్ణ సైతం పోలీసులకు వాగ్మూలం ఇచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఝాన్సీకి చెందిన రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని సేకరించారు. కాల్‌డేటా, వాట్సాప్ సందేశాల ఆధారంగా సూర్యతేజతో చాలా కాలంగా సన్నిహితంగా మెలిగినట్టు గుర్తించారు. అనంతరం మృతురాలికి చెందిన డైరీని సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత సమాచారాన్ని సేకరించారు. శనివారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఝాన్సీ తల్లి వంద శాతం సూర్యతేజ వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. నటన మానివేయాలన్న విషయంలో ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఏ మేరకు వేధింపులకు గురిచేశారు, ఆత్మహత్యకు సూర్యతేజే కారణమా..? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నటి ఝాన్సీ కేసులో అన్ని కోణాల్లో సమాచారం సేకరించడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నామని పంజాగుట్ట ఏసీపీ విజయకుమార్ తెలిపారు.