క్రైమ్/లీగల్

గోద్రా అల్లర్లలో మోదీకి క్లీన్ చిట్‌పై సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్లతో సంబంధమున్న అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి, పలువురు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో విచారిస్తామని సుప్రీం కోర్టు సోమవారం తెలియజేసింది. 2002, ఫిబ్రవరి 28న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 కోచ్‌ను కొందరు దుండగులు దగ్ధం చేయడంతో 59 మంది సజీవ దహనమయ్యారు. ఆ మరునాడు జరిగిన అల్లర్లలో గుల్‌బర్గ్ సొసైటీలో 68మంది మృతి చెందారు. అందులో జకియా జాఫ్రీ భర్త, మాజీ ఎంపి ఇషాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. దీనిపై విచారణ జరిపిన స్పెషల్ టీమ్ 2012, ఫిబ్రవరి 8న మోదీ సహా 63మంది అధికారులు, నేతలకు క్లీన్ చిట్ ఇస్తూ వీరిపై కేసు నమోదు చేయడానికి అవసరమైన ఆధారాలు లేవంటూ మూసివేసింది. తర్వాత 2017, అక్టోబర్ ఐదున దీనిపై గుజరాత్ హైకోర్టులో కేసు వేయగా సిట్ దర్యాప్తును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తున్నందున, వారి పిటిషన్‌ను పాక్షికంగా అంగీకరిస్తూనే ఈ కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం మెజిస్ట్రేట్ కోర్టును కాని, సుప్రీం కోర్టును కాని ఆశ్రయించాలని సూచించింది. దీంతో జాకియా జాఫ్రీ తరఫున పిటిషన్ దాఖలు చేసిన అపర్ణ్భాట్ నిందితులకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ, దీనిని పునర్విచారించాలని కోరింది. ధర్మాసనం దీనిని పరిశీలించి విచారణను జూలైకు వాయిదా వేసింది.