క్రైమ్/లీగల్

ఈసారి కనిష్క..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 21: మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈసారి చైన్నైలోని కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకులను రూ.1000 కోట్లకు ముంచిన విషయం వెలుగులోకి వచ్చింది. కనిష్క గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.842.15 కోట్ల రుణం కుంభకోణంపై విచారణ జరపాల్సిందిగా గత జనవరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సీబీఐని కోరినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. ఈ భూపేష్ కుమార్ జైన్, అతని భార్య నీతా జైన్‌లు ఈ కంపెనీకి ప్రమోటర్లుగా, డైరెక్టర్లుగా ఉన్నారు. ఎస్బీఐ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్టియం ఈ కంపెనీకి రూ.842.15 కోట్లు రుణంగా ఇచ్చాయి. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.1000 కోట్లకు చేరుకుంది. 2017 మార్చిలో కంపెనీ, ఎనిమిది బ్యాంకులకు వడ్డీ చెల్లించలేదు. తర్వాత మొత్తం 14 బ్యాంకులకు వడ్డీ చెల్లింపులు నిలిపేసింది. కాగా రుణదాతలు 2017 మే 25న కనిష్క్ కార్పొరేట్ కార్యాలయం, ఫ్యాక్టరీ, షోరూమ్‌లను సందర్శించారు. అయితే కార్యాలయం, షోరూమ్‌లు మూసివేసి ఉండటం గమనించారు. గత ఏడాది నవంబర్‌లో ఎస్బీఐ ఈ ఖాతాను మోసపూరితమైనదంటూ ఆర్‌బిఐకి తెలియజేసింది. కాగా ఈ ఏడాది జనవరి 25న స్టేట్ బ్యాంక్, కంపెనీపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. తప్పుడు రికార్డుల సృష్టి, రాత్రికి రాత్రే మూసివేయడం అంశాలను ఫిర్యాదులో పేర్కొంది. కనిష్క ప్రమోటర్లు బ్యాంకర్లకు అందుబాటులో లేరు. ప్రస్తుతం వారు మారిషస్‌లో నివసిస్తున్నట్టు అనుమానాలు వెలువడుతున్నాయ. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది.
కనిష్కకు రుణాలిచ్చిన బ్యాంకులు
ఎస్‌బిఐ, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్,
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, యూకో బ్యాంకు, తమిళనాడు మర్కెంటైల్, ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకులు కనిష్కకు రుణాలిచ్చాయ. ఇందులో ఎస్బీఐ అత్యధికంగా రూ.215 కోట్లు రుణం ఇవ్వగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.115 కోట్లు కనిష్క కంపెనీకి రుణం ఇచ్చింది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకులు ఒక్కొక్కటి రూ.50 కోట్ల వంతున రుణాలిచ్చాయి. గత రెండు నెలల కాలంలో దేశంలో బయల్పడుతున్న కుంభకోణాల్లో ఇది తాజాది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 13,000 కోట్ల కుంభకోణాన్ని గత ఫిబ్రవరిలో కనుగొన్నారు. ఈ వారం మొదట్లో ఢిల్లీ పోలీసులు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.3.5 కోట్ల మేర రుణాల్లో జరిగిన అవినీతిని వెలికితీశారు. మరో కేసులో ముంబయికి చెందిన ఆర్థిక నేరాల పోలీసులు, బ్యాంకులను రూ.4,000 కోట్లమేర మోసం చేసిన ఆరోపణలపై పారెఖ్ అల్యూమినెక్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేయడం తెలిసిందే.