క్రైమ్/లీగల్

ఉప్పల్‌లో హిజ్రాల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 13: ఉప్పల్ రింగ్‌రోడ్డులో మంగళవారం అర్థరాత్రి హిజ్రాలు బీభత్సం సృష్టించారు. బస్సు కోసం నిల్చున్న ప్రయాణికులను డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా వారిపై దాడి, కారు అద్దాలు ధ్వంసం చేసి జేబులో ఉన్న నగదుతో పాటు మెడలోని బంగారు చైన్, ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్‌లు, విలువైన పత్రాలను బలవంతంగా లాక్కున్నారు. ఇచ్చిన సమాచారం ప్రకారం ఆలస్యంగా పోలీసులు వచ్చి దాడికి పాల్పడిన హిజ్రాలతో పాటు వారికి సహకరించిన యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తమపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ పోలీసుల ముందే ఫిర్యాదు చేసిన వారిపై మళ్లీ దాడికి దిగారు. అడ్డుకోబోయిన హోంగార్డులను సైతం కొట్టారు. అదే సమయంలో విధి నిర్వహణలో అక్కడికి వచ్చిన ఏసీపీ గాంధీ నారాయణపై దాడికి యత్నించారు. ఐదు గంటల పాటు స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తార్నాక నాగార్జున కాలనీలో నివసిస్తున్న వ్యాపారవేత్త ఆర్.ప్రదీప్ రెడ్డి సోదరుడు రాంచంద్రా రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం నాగోల్‌లో జరిగిన ఫంక్షన్‌కు హాజరయ్యారు. తిరిగి రాత్రి తార్నాక వైపు కారులో వస్తుండగా మధ్యలో రాంచంద్రా రెడ్డి ఉప్పల్ బస్టాండ్‌లో దిగి జనగామ బస్సు కోసం నిల్చున్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన కొందరు హిజ్రాలు వాగ్వివాదానికి దిగి డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే కారు అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. వారిపైనా దాడి చేసి గాయపర్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వారి బంధువు రాంరెడ్డి.. ఎందుకు కొడుతున్నారని అడుగుతుండగా అతనిపైనా దాడి చేసి మెడలోని చైన్‌ను, జేబులో రెండువేల నగదు, విలువైన సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులను బలవంతంగా గుంజుకున్నారు. అప్పటికే 100కు డయల్ చేసినా ఆలస్యంగా పోలీసులు వచ్చి హిజ్రాలను అదుపులోకి తీసుకోగా విషయం తెలుసుకున్న మరికొందరు హిజ్రాలు వచ్చి స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. కానిస్టేబుల్ అభిషేక్, హోంగార్డు లాలునాయక్‌పై దాడి చేశారు. దాడి చేసిన హిజ్రాలు ఉప్పల్ బీరప్పగడ్డలో నివసిస్తున్న గౌస్‌పాషా అలియాస్ ఇమ్రాన్, అలియాస్ సిమ్రాన్(23), రాంనగర్ పార్శిగుట్టలో నివసిస్తున్న నెరలి రాకేష్ అలియాస్ రక్షిత(21), సికింద్రాబాద్ చిలకలగూడలో నివసిస్తున్న ఆరేపల్లి సాయి కృష్ణ అలియాస్ సారా(21), దాడిలో వీరికి సహకరించిన హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో నివసిస్తున్న ఎండీ రషీద్(19), చిలకలగూడకు చెందిన తెట్ల గోపాల పవన్ కుమార్(22), విద్యానగర్‌లో నివసిస్తున్న నాగారం ఆనంద్(25)ను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బుధవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.