క్రైమ్/లీగల్

బైక్ అదుపు తప్పి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 13: బైకు అదుపుతప్పి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి మృతిచెందిన సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తండాకు చెందిన సాయినాథ్ (18) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతినిత్యం వికారాబాద్ నుంచే విద్యార్థి కళాశాలకు వెళ్తుంటాడు. రోజులాగానే బుధవారం బైక్‌పై కళాశాలకు బయల్దేరాడు. వికారాబాద్ మహావీర్ ఆసుపత్రి ముందు బైక్ అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
గుట్కా ప్యాకెట్ల పట్టివేత
షాద్‌నగర్, ఫిబ్రవరి 13: గుట్కా ప్యాకెట్లను ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మంగళవారం రాత్రి షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని రాంనగర్ కాలనీలో లక్ష్మీనర్సింహా కిరాణాషాపులో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ప్యాకెట్లను విక్రయిస్తున్న సంపత్ అనే వ్యక్తిని షాద్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి గుట్కా ప్యాకెట్లు తీసుకువస్తున్నారనే విషయాలపై ముమ్మరంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్‌నగర్ పోలీసులు తెలిపారు.