క్రైమ్/లీగల్

మావో అగ్రనేత సుధాకర్ లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ అలియాస్ సట్వాజీ, ఆయన భార్య నీలిమా అలియాస్ అరుణ లొంగిపోయారని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. వీరిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డును దాదాపు రూ . 35 లక్షలు డీజీపీ అందజేశారు. హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధాకర్, నీలిమాను ప్రవేశపెట్టారు. డీజీపీ మహేందర్‌రెడ్డి అందించిన వివరాల ప్రకారం సుధాకర్ సొంతూరు నిర్మల్ జిల్లా సారంగాపూర్. ఆయన ఏడో తరగతి వరకూ సొంత ఊరులోనే చదివారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకూ నిర్మల్‌లో విద్యాభ్యాసం చేశారు. సుధాకర్ ఇంటర్‌మీడియట్ చదివే రోజుల్లో విద్యార్థుల సమస్యలపై రాడికల్ విద్యార్థి సంఘం(ఆర్‌ఎస్‌యూ) ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆర్‌ఎస్‌యూలో పనిచేస్తూ పీపుల్స్‌వార్‌కు దగ్గరయ్యారు. 1998లో వైద్గుల నీలిమా అలియాస్ అరుణను సుధాకర్ వివాహం చేసుకున్నారు. 1984- 85 నిర్మల్ జిల్లాలో రాడికల్ కార్యక్రమాలు చేపట్టే కటకం సుదర్శన్, వేణుతో కలసి పని చేశారని డీజీపీ తెలిపారు. 1986లో ఇర్రీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధాల తయారీతో పాటు వాటిని పీపుల్స్‌వార్ గ్రూపుకు సరఫరా చేయడానికి బెంగళూరు కేంద్రంగా సుధాకర్ పని చేశారు. అప్పుడే సుధాకర్‌ను పీపుల్స్‌వార్ అగ్రనేతలు గుల్బర్గలో పనిచేస్తున్న సదానల రామకృష్ణను పరిచయం చేశారన్నారు. 1986లో కొరియర్లు పట్టుబడడంతో సుధాకర్ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ అరెస్టు సమయంలో పోలీసులకు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాంనగర్ కుట్ర కేసులో సుధాకర్ ప్రమేయం ఉందని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 1986-89 సంవత్సరంలో ఆయన జైలు జీవితం గడిపారు. సుధాకర్ జైలఋ నుంచి విడుదల అయిన తరువాత రైతుకూలీ సంఘం ఏర్పాటు చేశారని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయడానికి విప్లవ రచయితల సంఘ నేత వరవరరావు ప్రోత్సాహంచినట్లు చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలో పీపుల్స్‌వార్ మిలటరీకి నాయకత్వం వహించారని స్పష్టం చేశారు. అప్పు డే పేలుడు పదార్థాల తయారీ, ఆయుధాల సరఫరాలో కీలక పాత్ర పోషించారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీబలోపేతం చేయడానికి ఆయనను పంపేవారని డీజీపీ పేర్కొన్నారు. కాగా బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని నేతలు సహకరించకపోవడంతో సుధాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, అప్పటి నుంచి పార్టీ నుంచి బయట పడడానికి ప్రయత్నించినట్లు మహేందర్‌రెడ్డి చెప్పారు. దీనికితోడు మావోయిస్టు అగ్రనేతల వత్తిడి భరించలేక మహిళా దళ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు సారధి నంబాళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజు భార్య రామక్క అలియాస్ శారద కూడా 2010లో ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ చెప్పారు. 2013లో పార్టీ అగ్రనేతల విధానాలపై ప్రజల్లో విశ్వాసం సడలుతోందని హైకమాండ్‌కు సుధాకర్ చెప్పారు. 2017లో జరిగిన విస్తృత చర్చల్లో అనారోగ్యంతో పనిచేయలేని నేతలు స్వచ్ఛందంగా పార్టీ నుంచి వైదొలగవచ్చునని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముప్పాళ్ల లక్ష్మణరావుఅలియాస్ గణపతి సూచనల మేరకే నంబాళ్ళ కేశవరావును కేంద్ర కమిటీ అగ్రనేతగా ప్రకటించినట్లుగా ఆయన చెప్పారు. తెలంగాణ దండకారణ్యంలో పీపుల్స్‌వార్‌ను పటిష్టం చేయడానికి 500 మంది ఉన్న దళాన్ని 2000 వరకు పెంచారని, అలాగే చత్తీస్‌గఢ్‌లో దాదాపు 7000 మంది దళ సభ్యులు నియమించారన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన శ్రవంతిలోకి రావాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపుఇచ్చారు.
చిత్రం.. మావోయిస్టు అగ్రనేత సుధాకర్, ఆయన భార్య నీలిమను మీడియా ముందు ప్రవేశపెట్టి,
వివరాలను వెల్లడిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి