క్రైమ్/లీగల్

రూ.4.5 కోట్ల విలువైన సెల్‌ఫోన్లతో కంటైనర్ అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో సంచలన దోపిడీ జరిగింది. సెల్‌ఫోన్‌లతో వెళ్తున్న కంటైనర్‌ను సినీఫక్కీలో అపహరించుకుపోయారు. సంచలనం రేపిన ఈ ఘరానా చోరీ జిల్లాలో వెంకటాచలం వద్దగల జాతీయ రహదారిపై మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా శివారు శ్రీసిటీలోని రెడ్‌మీ సెల్ ఫోన్ల తయారీ సంస్థ నుండి సుమారు 4.5 కోట్ల విలువైన ఫోన్లను కంటైనర్ ద్వారా కలకత్తాకు తరలించేందుకు రహదారి మార్గంలో బయలుదేరింది. కొందురు గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్‌ను వెంబడించి వెంకటాచలం టోల్ ఫ్లాజా దాటిన తర్వాత దాని ముందు లారీ ఆపి దాన్ని అడ్డుకున్నారు. కంటైనర్ రన్నింగ్‌లో ఉండగానే చోరులు మరో లారీ నుండి కంటైనర్ క్యాబిన్‌లోకి చొరబడి డ్రైవర్‌ను చంపేస్తామని బెదిరించారు. అతడిని కంటైనర్‌లోనే నిర్భంధించి దగదర్తి వరకూ తీసుకెళ్లి సమీపంలోని అడవిలో నిర్మానుష్యమైన ప్రాంతానికి తరలించారు. అక్కడ కంటైనర్ తలుపులు తెరచి లోపలున్న సెల్ ఫోన్లను ప్యాంకింగ్ బాక్సులతో సహా మరో లారీలోకి మార్చుకున్నారు. తమతో పాటు కంటైనర్‌ను తీసుకెళ్లి గౌరవరం వద్ద వదిలేసి తమతో తెచ్చుకున్న లారీలో ఉడాయించారు. కొంత సేపటికి తేరుకున్న డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్ స్థానికుల సహాయంతో దగదర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కంటైనర్‌ను పరిశీలించారు. దగదర్తి పోలీసు స్టేషన్‌కు తరలించి డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఎస్ అంకమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపహరణకు గురైన సెల్‌ఫోన్ల విలువ సుమారు రూ. 4.80 కోట్లుగా నిర్థారించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి దగదర్తి స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కంటైనర్‌ను పరిశీలించి చోరీ జరిగిన తీరును డ్రైవర్ ఇంతియాజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని టోల్ గేట్లకు సమాచారం అందించినట్లు తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట క్రైం బ్రాంచి సీఐ బాజీజాన్ సైదా, బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు ఉన్నారు.