క్రైమ్/లీగల్

భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 21 : జమ్ము-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం నుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఎదురు దాడుల్లో ఇద్దరు జవాన్లు సహా నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు. హల్మోత్‌పురకు చెందిన దట్టమైన అడవుల్లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇవి కుప్వారాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే సైనికుల మరణాలపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా వారిని పోలీసులు దీపక్, అష్రాఫ్‌లుగా గుర్తించారు. నియంత్రణ రేఖపై మన భద్రతలోని లోపాలను ఎన్‌కౌంటర్ బయటపెట్టింది. మిలిటెంట్లు షంశాబారి పర్వతాల్లోని రెండు శిఖరాలను దాటి మన భూభాగంలోకి 8 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చారు. నియంత్రణ రేఖను దాటిన తర్వాత మిలిటెంట్లు స్థానిక మిలిటెంట్లతో ‘రిసిప్షన్ పార్టీ’ చేసుకున్నారు. తర్వాత వారు కుప్వారా పట్టణంవైపునకు వస్తుండగా భద్రతా బలగాలు అడ్డుకున్నట్టు అధికార్లు తెలిపారు. మసీదులో దాక్కున్న మిలిటెంట్లు తర్వాత అడవుల్లోకి పారిపోవడానికి యత్నించగా నలుగురిని భద్రతాదళాలు మట్టుపెట్టాయి. ఇంకా ఇద్దరు మసీదులోనే నక్కినట్టు అనుమానం. వీరు ఎతె్తైన ప్రదేశంపై ఉండి భద్రతాదళాలపై కాల్పులు జరుపుతున్నారని అధికార్లు తెలిపారు.
భద్రతా సిబ్బందికి ముఫ్తీ నివాళి
జమ్ము-కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ మరణించిన నలుగురు భద్రతాసిబ్బందికి ఘన నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారని రాష్ట్ర సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కాగా ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.