క్రైమ్/లీగల్

దివీస్ ల్యాబ్స్‌లో ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఫిబ్రవరి 14: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం, లింగోజిగూడెం గ్రామ శివారులోని ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ లేబోరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమలో గురువారం ఐటీ దాడులు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని దివీస్ పరిశ్రమలు, కార్యాలయాలపై ఏక కాలంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఉదయం సుమారు 20 నుంచి 30 మంది ఐటీ శాఖ అధికారుల బృందం, పోలీస్ అధికారులు పరిశ్రమలోకి ప్రవేశించి తనిఖీలు ప్రారంభించారు. పరిశ్రమ కార్యాలయాలలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశ్రమ ప్రతినిధులను విచారించారు. ఉద్యోగులను ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు. మీడియాను లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. ఫొటోలను కూడా సేకరించేందుకు అవకాశమివ్వలేదు. సక్రమంగా జీఎస్‌టీ, ఆదాయ పన్ను చెల్లించడంలేదన్న అభియోగంపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారి ఒకరు చెప్పారు. తాము సకాలంలో సక్రమంగానే పన్నులు చెల్లిస్తున్నామని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని, ఐటీ అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరిస్తున్నామని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు.