క్రైమ్/లీగల్

బావిలో పడిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మార్చి 21: వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన కోడలు, మనుమరాలు, మనుమడిని పుట్టింటిలో దింపేందుకు కారులో తీసుకువెళ్తున్న మామ.. మరో పావుగంటలో తాత, అమ్మమ్మల ఒడిలో అనందంగా ఒదిగిపోదామని అనుకున్న అనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపురం వద్ద వరంగల్ - కరీంనగర్ రహదారిపై బుధవారం మధ్యాహ్నం కారు బావిలో పడిన దుర్ఘటనలో తాత, మనుమడు మృతి చెందగా, కోడలు, మనుమరాలు తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. వరంగల్‌లో గణేష్ నగర్‌లో నివాసముండే మున్సిపల్ శాఖ రిటైర్డు ఉద్యోగి ఎదురుకట్ల సుధాకర్ (65) తన కోడలు భవాని (35), మనుమడు వివాన్ (06), సాన్వి (03) లతో కలిసి తన వియ్యంకులైన రాపర్తి సులోచన - రాజయ్యల ఇంటికి టాటా ఇండికా కారులో వెళ్తుండగా సింగాపురం బస్ స్టాప్ దాటిన తర్వాత ఒక్కసారిగా కారు టైర్ పేలి అదుపుతప్పి కుడిపక్కన ఉన్న నీళ్లున్న వ్యవసాయ బావిలో పడింది. దీంతో కారు డ్రైవ్ చేస్తున్న సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనను చూసిన సింగాపురం గ్రామస్తులు, రైతులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని మిగతా వారిని కాపాడే ప్రయత్నం చేసారు. కారులో ఉన్న మిగతా ముగ్గురినీ తాళ్ల సహాయంతో బయటకు తీసారు. బయటకు తీసిన తర్వాత కొనప్రాణంతో ఉన్న వివాన్ కూడా మృతి చెందాడు. భవాని, సాన్విలను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం వరంగల్ ఎంజిఎంకు తరలించారు. ఇందులో భవానికి తీవ్ర గాయాలయ్యాయి. బావిలో కారులో ఉన్న పాప నీటిలో మునిగి పోకుండా భవాని చాకచక్యంతో తన చేత్తో పాపకు శ్వాస అందేలా చేసి తన పాపను బతికించుకోగలిగింది. కాగా భవాని భర్త, మృతుడు సుధాకర్ కుమారుడు ఎదురుకట్ల వరుణ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవులకు వీరు హైదరాబాద్ రావడంతో భవానిని, పిల్లలను ఆమె తల్లిగారింట్లో దించేందుకు సుధాకర్ కారులో బయలుదేరారు. కారు టైరు పేలడం, పక్కనే వ్యవసాయ బావి ఉండడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. వేసవి సెలవులను తమ తాతల ఇళ్లలో ఆనందంగా గడుపుదామనుకున్న వారి కుటుంబంలో ఈ ప్రమాదం విషాదం నింపింది. ఇంటికి పెద్ద అయిన సుధాకర్, ఆరేళ్ల మనుమడు వివాన్ మృతి చెందడం వారిని కలచివేసింది. హుజూరాబాద్ ఇన్‌చార్జి ఏసీపీ కృపాకర్, సీఐలు రమణమూర్తి, రవి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసారు.