క్రైమ్/లీగల్

రూ. 4లక్షల నకిలీ నోట్లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ చంద్రాయణ గుట్టకు చెందిన మహమ్మద్ గౌస్ రూ 4 లక్షల నకిలీ నోట్లను అసలు నోట్లగా చెలామణి చేయడానకి ప్రయత్నిస్తూ టాస్క్ఫోర్సు పోలీసులకు దొరికిపోయారు. మహమ్మద్ గౌస్ దాదాపు 12 కేసులు నమోదు అయ్యాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వివరించారు. 1991 సంవత్సరంలో గౌస్ నుంచి పేలుడు పదార్థాలను (బాంబ్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. గౌస్‌పై టాడా చట్టం నమోదు చేశామన్నారు. 2011లో నకిలీ నోట్లను చెలామని చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారన్నారు. రెహమాన్ ద్వారా నకిలీ నోట్లను చేలామనికి ప్రయత్నించే వారన్నారు. 2019 జనవరి 19న గౌస్ జైల్ నుంచి బయటకు వచ్చారని, మళ్ళీ నకిలీ నోట్ల చెలామనికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయారని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ నోట్ల చేలామనికి దళారులను వినియోగిస్తూ, ఎక్కువ కమీషన్ ఇచ్చేవాడని కమిషనర్ తెలిపారు. టాస్క్ఫుర్స్ దక్షిణ మండల అడిషనల్ కమిషనర్ చైతన్య కుమార్, సీఐ మధుమోహన్‌రెడ్డి, ఎస్‌వోటీ శ్రీనివాస్ పాల్గొన్నారు.