క్రైమ్/లీగల్

వాద్రాకు మధ్యంతర ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా కేసులో మధ్యంతర బెయిల్‌లో మార్చి 2వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ కేసులో రాబర్ట్ వాద్రా తనకు సహకరించడం లేదని ఈడీ పేర్కొంది. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో అరెస్టు కాకుండా మనోజ్ ఆరోరాకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాబర్డ్ వాద్రాకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ కోర్టు ఆదేశాలు చేయరాదని ఈడీ కోరింది. ఈ కేసులో వాద్రాను మరింత తోతుగా విచారించాల్సి ఉందని ఈడీ తెలిపింది. వాద్రా విచారణకు సహకరించడం లేదని, సరైన సమాధానాలు చెప్పడంలేదని ఈడీ తెలిపింది. ఈడీ తరఫున కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్, న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తున్నారు. కాగా వాద్రా తరఫున న్యాయవాది కేటీఎస్ తులసి ఈ అభియోగాలను తోసిపుచ్చారు. వాద్రా కేసు విచారణకు వచ్చేటప్పుడు ప్రదర్శనగా వస్తున్నారని ఈడీ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వాద్రా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. లండన్‌లో వాద్రాకు సంబంధించి ఉన్న అనేక ఆస్తుల వివరాలను సేకరించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది.