క్రైమ్/లీగల్

స్థల వివాదంలో వ్యక్తిని గన్‌తో బెదిరించిన ఎనిమిది మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 16: వ్యక్తి వద్ద ప్లాట్లు కొనుగొలు చేసి డబ్బులు అడిగితే గన్‌తో బెదిరించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మందిని అరెస్టు చేసిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఏసీపీ శివకుమార్ వెల్లడించారు. నేరేడ్‌మెట్ మధురానగర్‌లో నివసించే రామనర్సింహులు సిమెంట్ వ్యాపారి. ఇతడికి మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామం దగ్గర 54 ప్లాట్లు ఉన్నాయ. మణికొండ ల్యాంకోహిల్స్‌లో నివసించే రియల్ ఎస్టెట్ వ్యాపారి కొలపర్తి పోలిచెట్టి (43) గత ఏడాది డిసెంబర్ 1న నర్సింహులుకు చెందిన ప్లాట్లను ఏడు కోట్ల రూపాయలకు కొనుగొలు చేసేందుకు కొంత మొత్తం డబ్బులు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈనెల 27న మిగతా డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని చెప్పాడు. కాగా డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో పొలిచెట్టిపై నర్సింహులు ఒత్తిడి తెచ్చాడు. పొలిచెట్టి తన అనుచరులైన చామర్తి సునీల్ కుమార్, దాసరి యోగేశ్వర్ బాలకృష్ణ, చెగూరి నర్సింహా, వాసు, హరిచందరమణి త్రిపాఠి, ఎండీ ముక్తార్, యూసఫ్ ఖాన్, రామకృష్ణతో కలసి శుక్రవారం రాత్రి నర్సింహులు ఇంటికి వచ్చాడు. అతడు ఇంట్లో, దుకాణంలో లేకపోవడంతో అతని వద్ద ఉన్న గన్‌తో పని వాళ్లని బెదిరించాడు. విషయం తెలుసుకున్న నర్సింహులు నేరేడ్‌మెట్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు శనివారం ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇన్నొవా కారు, గన్ స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ నరసింహ స్వామి పాల్గొన్నారు.