క్రైమ్/లీగల్

తాబేళ్ల లారీ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఫిబ్రవరి 16: కైకలూరు పరిసర ప్రాంతాల నుండి తాబేళ్లను ఇతర రాష్ట్రాలకు యధేచ్చగా తరలిస్తున్న లారీని శుక్రవారం రాత్రి స్థానిక అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఫారెస్ట్ రేంజర్ బత్తిన విజయ తెలిపారు. కలిదిండి మండలంలోని మద్వానిగూడెం వద్ద అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్నారని తెలిసిన సమాచారం మేరకు నిఘావేసి తాబేళ్ల లోడుతో వెళుతున్న లారీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అధికారులు ఆ లారీని ఆటపాకలోని పక్షుల కేంద్రం వద్దకు తీసుకువచ్చి శనివారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడతూ లారీలో సుమారు 1600 తాబేళ్లను తరలిస్తున్నారని వాటిని కోల్లేరులో వదిలేస్తామన్నారు. లారీ డ్రైవర్‌ను, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని నిందితులపై 1972 వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద కేసునమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయప్రకాష్, గార్డు వెంకన్న, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.