క్రైమ్/లీగల్

రాష్ట్రంలో పెరుగుతున్న గృహహింస కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: గృహహింస నిరోధానికి చట్టం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. చట్టం ఉన్న విషయం చాలామంది మహిళలకు తెలియపోవడం, వారి హక్కులపై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మహిళలకు గృహహింసకు గురవుతూనే ఉన్నారు. పనిచేసే ప్రదేశాల్లో దాదాపు 12రకాల వేధింపులకు సంబంధించి కేసు దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ దానిపై మహిళల్లో అవగాహన కొరవడింది. దీనిపై తగిన ప్రచారం కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోందనే విమర్శలున్నాయి. ఇటీవలి కాలంలో ఉద్యోగినులపై దాడులు ఎక్కువవుతున్నాయని, ఈ ధోరణి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని కొన్ని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగినులపై దాడులకు పాల్పడే ప్రజాప్రతినిధుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయా సంఘాలు భావిస్తున్నాయి. మహిళా కమిషన్‌కు వచ్చే కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గృహహింసకు సంబంధించిన కేసుల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉండటం గమానార్హం. రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా కేసుల తాకిడి ఎక్కువవుతోంది. కమిషన్‌కు 2016-17 సంవత్సరంలో 836 కేసులు నమోదు కాగా, 2017-18 సంవత్సరంలో ఈ సంఖ్య 1086కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. 2017-18 సంవత్సరంలో గృహహింసకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్‌కు 250 పిటీషన్లు రాగా, వాటిలో 152 కేసులను పరిష్కరించింది. పనిచేసే ప్రాంతాల్లో వేధింపులకు సంబంధించి 100 ఫిర్యాదులు రాగా వాటిలో 29 పిటీషన్లను పరిష్కరించింది. వరకట్నానికి సంబంధించి 79 ఫిర్యాదులు రాగా, వాటిలో 54 కేసులను పరిష్కరించింది. వివాహేతర సంబంధాలపై 59 ఫిర్యాదులు, సహజీవనానికి సంబంధించి 60 కేసులు, ప్రేమ పేరుతో మోసానికి సంబంధించి 29 కేసులు నమోదు కావడం గమనార్హం. పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు సంబంధించి 36 కేసులు నమోదు కాగా, వాటిలో 11 పరిష్కరించింది. ఇక మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో గత ఏడాది గుంటూరు నుంచి 395 ఫిర్యాదులు అందాయి. తరువాతి స్థానాల్లో 112 ఫిర్యాదులతో పశ్చిమ గోదావరి, 100 ఫిర్యాదులతో కృష్ణా, 95 ఫిర్యాదులతో తూర్పు గోదావరి ముందున్నాయి. విశాఖ నుంచి 69, అనంతపురం జిల్లా నుంచి 52, నెల్లూరు నుంచి 45, చిత్తూరు నుంచి 44, కర్నూలు నుంచి 44, కడప నుంచి 25, విజయనగరం నుంచి 8, శ్రీకాకుళం నుంచి 25 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ నుంచి 2, కర్నాటక, ఒడిశా, తమిళనాడు, ఆస్ట్రేలియా నుంచి ఒక్కో కేసు నమోదయ్యాయి. ఈసందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమ కమిషన్ ప్రజల్లోకి వెళ్లి చైతన్యవంతులను చేయడం వల్ల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. టీవీ సీరియళ్లలో మహిళా విలన్లు సమాజంపై చెడు ప్రభావం చూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన చిత్రాలు, సీరియళ్లు మహిళలను గౌరవించేలా ఉండేవని, అవి స్ఫూర్తిదాయకంగా ఉండేవన్నారు. ఇటీవలి కాలంలో ప్రసారం అవుతున్న సీరియళ్లలో వివిధ సమస్యలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడటాన్ని చూపిస్తున్నారని, మహిళలను కుట్రదారులు, రౌడీలు, హత్యలు చేసేవారిగా, తదితర నెగెటివ్ రోల్స్‌లో చూపిస్తున్నారన్నారు. టీవీ సీరియళ్లను సెన్సార్ చేసేందుకు కూడా ఒక బోర్డు ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించేలా వివిధ చట్టాల గురించి పుస్తకాలు ప్రచురించామని, విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని రాజకుమారి వివరించారు.