క్రైమ్/లీగల్

జయరాం హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, పిబ్రవరి 17: ప్రవాస భారతీయుడు చిగురిపాటి జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి అక్రమ భూ దందాలపై పోలీస్ అధికారులు దృష్టి పెట్టారు. పోలీస్ అధికారులతో సన్నిహిత సంబంధాలను రాకేష్‌రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని రౌడీ షీటర్స్, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు, సినిమా నటులతో భూ దందాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయ్యింది. ఇప్పటి వరకు జయరాం హత్యపై విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు రాకేష్‌రెడ్డి భూ దందాలపై సమాచారం సేకరిస్తున్నారు. జనవరి 31న జయరాం శవాన్ని కారులో విజయవాడకు తీసుకువెళ్తున్న సమయంలో రాకేష్‌రెడ్డికి ఇబ్రహీంపట్నం ఎసీపీ మల్లారెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. భూ దందాల విషయాన్ని మీతో మాడ్లాడాలని రాకేష్‌రెడ్డికి మల్లారెడ్డి ఫోన్ చేసినప్పుడు జయరాం శవాన్ని తీసుకుపోతున్నానని రాకేష్‌రెడ్డి చెప్పడంతో మల్లారెడ్డి ఫోన్ కట్ చేశారు. ఈ విషయాలను ఆంధ్రా పోలీసులు తెలంగాం పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎసీపీ మల్లారెడ్డితో పాటు నల్లకుంట, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల సీఐలపై బదిలీ వేటు పడింది. ఈనెల 18న విచారణకు హాజరు కావాలని బదిలీ అయిన అధికారులకు దర్యాప్తు అధికారులు సమచారం ఇచ్చారు. విచారణలో ఏమి జరుగుతుందోనని బదిలీ అయిన అధికారుల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది. రాకేష్‌రెడ్డి పూటకోమాట మార్చుతూ దర్యాప్తు అధికారులకు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నారు. కేవలం డబ్బుల కోసం బెరించడం,కాకపోతే హత్యలకు పాల్పడుతున్న అంశాలు బయటకు రావడంతో కేసును మరింత వేగవంతం చేస్తున్నారు. స్థిరాస్థి వ్యాపారం పేరుతో రాకేష్‌రెడ్డి పలువురు వ్యాపారులను మోసం చేశారని, ఈ మోసాలకు పోలీస్ అధికారులు కూడా సహకరించారని విచారణలో తేలింది. మరింత సమాచారం రాబట్టేందుకు రాకేష్‌రెడ్డిని పోలీస్ కష్టడీకి అప్పచెప్పాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై రాకేష్‌రెడ్డిని 8 రోజుల పోలీస్ కష్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.