క్రైమ్/లీగల్

ప్రేమ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, ఫిబ్రవరి 17: ఇంట్లో కుటుంబీకులు తమ పెళ్లిని అంగీకరించరనే మనోవేదనతో ఓ ప్రేమ జంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సం ఘటన ఆదివారం ఉదయం తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాన్సీలింగాపూర్‌కు చెందిన నల్లబాలు (21), రాయిలాపూర్‌కు చెందిన పర్వీన్ (18) గత కొద్ది రోజులుగా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో కుటుంబీకులు తమ ప్రేమ పెళ్లిని అంగీకరించరనే అనుమానంతో ఆదివారం జాన్సీలింగాపూర్‌లోని గ్రామ శివారులోని ఓ చెట్టుకు చున్నీతో ఉరివేసుకొని ఇరువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్‌ఐ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల రోదనలతో ఆప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయంది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.