క్రైమ్/లీగల్

కోర్టు ధిక్కారణ కేసులో ఒకరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, ఫిభ్రవరి 18: మండలంలోగల రాళ్లపాడు పంచాయతీ ముప్పిడి గ్రామానికి చెందిన దేశెల్ల శాంతరావు2013లో చిట్టి సుందరమ్మపై పోలాకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగం జరిగిందని ఎస్సై టి. ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటినుండి నరసన్నపేటలో గల కోర్టులో వాయిదాలు నడుస్తుండేవని ఆయన తెలిపారు. వీటికి క్లైంట్‌దారులు కోర్టుకు హాజరు కాగా ముద్దాయి సుందరమ్మ హాజరుకాకపోవడం పట్ల కోర్టువారు అరెస్ట్ వారెంట్ మంజూరు చేశారని ఆయన అన్నారు. కోర్టు ఉత్తర్వులు మేరకు సోమవారం అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపర్చడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ఈమె కూతురు చిట్టి సుశీల ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎన్నో ఏళ్లుగా నాకు, నాతల్లికి జరిగిన అన్యాయం పట్ల గ్రామానికి వచ్చి విచారణ జరపాలని ఆమె కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఆమె కోరిక మేరకు సోమవారం గ్రామానికి వెళ్లి గ్రామంలో ఉన్న వారిని, ముద్దాయి సుందరమ్మను విచారించడం జరిగిందని, అనంతరం సుందరమ్మను కోర్టులో హాజరుపర్చడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కానిస్టేబుళ్లు రాజేంద్రప్రసాద్, భవాని, గ్రామస్థులు పాల్గొన్నారు.