క్రైమ్/లీగల్

బాలికపై మైనర్ అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె: ఏడేళ్ల బాలికపై మైనర్ అత్యాచారం జరిపాడు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పల్లె ఎస్‌ఐ శివాంజల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బనగానపల్లె పట్టణం అవుకుమెట్ట సమీపంలోని రాంభూపాల్‌నగర్‌కు చెందిన చిన్నారి(7) ఆదివారం ఇంటివద్ద ఆడుకుంటుండగా బంధువు వరుసయ్యే బాలుడు(17) మాయమాటలు చెప్పి సమీపంలోని గోడచాటుకు తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలపడంతో వారు ఆందోళనకు గురయ్యారు. తర్జనభర్జన అనంతరం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ శివాంజల్ బాధిత చిన్నారి, వారి తల్లిదండ్రులను విచారించారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను వైద్యి పరీక్షల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యిశాలకు తరలించినట్లు ఎస్‌ఐ శివాంజల్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.