క్రైమ్/లీగల్

ధనార్జనే పరమావధి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశంలోని వైద్య, న్యాయవిద్యను అపహాస్యం చేసే ఎవరినీ తాము ఉపేక్షించమని, వాటి నాణ్యత విషయంలో రాజీపడే వారిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని వైద్య కళాశాలలను తనిఖీ చేయడానికి తమను అనుమతించడం లేదంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌లు ఎస్‌ఏ బోబ్డే, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ ‘కేవలం ధనార్జనకే కొందరు వైద్య, న్యాయ విద్యాసంస్థలు నడుపుతున్నారు.. కాని ఆ సంస్థల్లో కచ్చితంగా నాణ్యమైన విద్యను అందించాల్సిందే అన్నది కోర్టు కచ్చితమైన అభిఅపాయం’ అని వ్యాఖ్యానించింది. వైద్య, న్యాయవిద్యను అపహాస్యం చేసే ఏ చర్యను కోర్టు క్షమించదు.. ఉపేక్షించదు.. విద్య అన్నది కొందరికి వ్యాపారం అయితే కావొచ్చు.. కాని అందులో నాణ్యతకు రాజీపడితే ఊరుకోం అని ధర్మాసనం పేర్కొంది. సంబంధిత కాలేజీలు నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోతే వారికి జైలు తప్పదని హెచ్చరించింది. తనిఖీలకు అనుమతి ఇవ్వని కాలేజీలు వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశాలు జరుపుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించింది. ఎంసీఐ దాఖలు చేసిన ఫిర్యాదుపై బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని పేర్కొంటూ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మూడు రాష్ట్రాల్లోని ఎనిమిది కాలేజీల్లో నిర్దేశిత ప్రమాణాలు పాటించడం లేదని, లోపాలున్నాయని పేర్కొంటూ కేంద్రం వాటి అడ్మిషన్లను నిలిపివేయగా, గత ఏడాది జూన్ 18న వాటికి సుప్రీం కోర్టు మినహాయింపును ఇచ్చింది. మొత్తం 800 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను 2018-19 సంవత్సరానికి అడ్మిషన్లు జరుపుకోవచ్చునని పేర్కొంది. ఎంసీఐ వాటిని పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతే వాటి అడ్మిషన్లను నిరాటంకంగా జరుపుకోవడానికి అనుమతి ఇస్తామని సుప్రీం పేర్కొంది. అయితే ఎంసీఐ ఆయా కాలేజీల తనిఖికి వెళ్లినప్పుడు కొన్ని కాలేజీలు వారిని లోపలకి అనుమతించకుండా అభ్యంతరం పెట్టడంతో ఎంసీఐ సుప్రీంను ఆశ్రయించింది.