క్రైమ్/లీగల్

నేరస్థునిపై పీడీ యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 19: దొంగతనాలు, లైగింకదాడులు లాంటి నేరాలు చేస్తూ పట్టుబడిన నేరస్థులు కాసుల రమేష్‌పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. మంగళవారం పోలీస్ అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సూరపల్లి గ్రామానికి చెందిన రమేష్‌పై హైదరాబాద్, రాచకొండ, ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పలు కేసులున్నాయి. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో 3కేసులు, కూసుమంచిలో ఒక కేసు ఉన్నదన్నారు. నేరాలకు అలవాటు పడిన వీరంతా పట్టుబడిన తరువాత బయటకు వచ్చినా తిరిగి ఇదే తరహ వృత్తిని చేపడుతున్నారన్నారు. ఇలాంటి వారిని అదుపు చేయటం కష్టసాధ్యమని అందుకే వ్యవస్థీకృత నేరగాళ్ళను అదుపుచేసేందుకు అమలు చేసే ప్రివెంటివ్ డిటెన్షన్(పిడి) యాక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తికి 12నెలల వరకు బెయిల్ లభించదన్నారు. తరచు నేరాలు చేస్తే పిడియాక్టు అమల్లో తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇంటిలిజెన్స్ పిడియాక్టు సెల్ అందుబాటులో ఉందన్నారు. ఈ చట్టం ప్రయోగించటం మొదలు పెట్టిన తరువాత అంతరాష్ట్ర నేరగాళ్ళు రాష్ట్రానికి రావటం గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. అలాగే జిల్లాలో కూడా నేరాల శాతం తగ్గుముఖం పట్టిందన్నారు. సమావేశంలో అడిషనల్ డిసిపి మురళీదర్, ట్రైని ఐపిఎస్ వినిత్ పాల్గొన్నారు.