క్రైమ్/లీగల్

దొంగతనాలే ప్రవృత్తిగా మార్చుకున్న స్నేహితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఫిబ్రవరి 19: చిన్నానాటి స్నేహితులు దొంగతనాలు ప్రవృత్తిగా మార్చుకుని 38 సిలెండర్లు, ఎల్‌ఈడీ టీవీ, వెండి పట్టాలు, మిక్సీ అపహరించిన సంఘటన ఇది. తెనాలి డిఎస్పీ కథనం ప్రకారం తూములూరుకు చెందిన ఆటో డ్రైవర్ అమ్మిశెట్టి శివచందు, దావులూరిపాలెంకు చెందిన తుల్లిమిల్లి రవి చిన్నానాటి నుండి స్నేహితులు. మద్యం, పేకాట వంటి చెడు వ్యసనాలకు బానిసైన వీరు కలసి దొంగతనం ప్రవృత్తిగా చేసుకొని కొల్లూరు, వేమూరు, తెనాలి, రేపల్లె, నిజాంపట్నం తదితర పోలీల్‌స్టేషన్స్ పరిధిలోని గ్రామాలలో ఇళ్ళకు తలుపులు, తాళాలు వేసియున్న వాటిని గుర్తించి పగలు, రాత్రి వేళల్లో గృహాల్లోని వంట గ్యాస్ సిలెండర్లు, ఎల్‌ఈడీ టీవీ, వెండి పట్టాలు, మిక్సీ, నగదు దొంగిలిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో కొల్లూరు పీఎస్ పరిధిలో రెండు కేసుల్లో రెండు సిలెండర్, స్మార్ట్ఫోను, 400 రూపాయలు, ఒక ఎల్‌ఈడీ టీవీ, వేమూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెండు కేసుల్లో 12 సిలెండర్లు, తెనాలి 3వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో 11 సిలెండర్లు, తెనాల తాలూకా పీఎస్ పరిధిలో 6 సిలెండర్లు, రేపల్లె స్టేషన్ పరిధిలో 6 సిలెండర్లు, నిజాంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక సిలెండరు, జత వెండి పట్టాలు, ఒక మిక్సీ వెరసి 38గ్యాస్ సిలెండర్లు, ఎల్‌ఈటీ టీవీ, వెండి పట్టాలు, మిక్సీ చోరీ చేశారు. ఈక్రమంలో వాటిని విక్రయించేందుకు తుల్లిమిల్లి రవి తన స్వగ్రామమైన దావులూరుపాలెం నుండి సోమవారం కొల్లూరుకు తరలిస్తుండగా మర్గమధ్యంలో లాకులవద్ద పోలీసులు ఆటోను తనిఖీచేయగా సిలెండర్లు దొంగిలించి తరలిస్తున్నట్లు గుర్తించి ఇద్దరినీ అరెస్టుచేసి, సిలెండర్లు స్వాధీనం చేసుకుని అరెస్టుచేసి కొల్లూరు పోలీస్టేషన్‌కు తరలించినట్లు డిఎస్పీ స్నేహిత తెలిపారు. ఈమేరకు కేసు నమోదుచేసకొని దర్యాప్తుచేపట్టి నిందితులను అరెస్ట్‌చేసినట్లు, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం కొల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తెనాలి రూరల్ సీఐ సుధాకరరావు, కొల్లూరు ఎస్‌ఐ పీ శివాజీ, ట్రైనీ ఎస్‌ఐ అరుణ, ఐఎస్‌ఐ శోభన్‌బాబు, స్టాలిన్, హెసీలు పోతురాజు, నరసింహారావు, సీహెచ్‌వీ శివా, ఎం కార్తీక్, ఎల్ బుల్లిబాబు, బీ ఏడుకొండలు తదితర సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.