క్రైమ్/లీగల్

గంజాయి విక్రేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, ఫిబ్రవరి 19: గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ జీవన్ కిరణ్ వివరాలను వెల్లడించారు. .... ఫతేనగర్ పార్దివాడకు చెందిన తరుణ్ (19) బాబుల్‌సింగ్ (32) ఒక జట్టుగా ఏర్పడి ఫోన్‌లో ఆర్డర్ తీసుకుని గంజాయి సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు నిఘా ఉంచి వలపన్ని వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల ఎండు గంజాయిని, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మరో ప్రాంతంలో దుర్గాప్రసాద్ ఫణి (26), సందీప్ (23) ఆటోలో గంజాయిని విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకుని వారినుంచి 2 కిలోల గంజాయిని, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.