క్రైమ్/లీగల్

భార్యపై అలిగి భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 19: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవ పడిన భర్త బైక్‌లో నుంచి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కాచవానిసింగారం ముత్వెల్లిగూడలో నివసిస్తున్న పసుపుల సత్యం (34) కూలి పని చేస్తున్నాడు.
చేసిన పనికి వచ్చిన డబ్బును తాగుడికే ఖర్చు చేస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం మద్యం కోసం భార్యను డబ్బు డిమాండ్ చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో అలిగి తన బైక్‌లో నుంచి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడని ఎస్‌ఐ బీ.శ్రీనివాస్ తెలిపారు.