క్రైమ్/లీగల్

భర్త దాడి.. చావుబతుకుల్లో గృహిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, ఫిబ్రవరి 19: భర్త కిరాతకంగా దాడి చేసి గాయపరచటంతో గృహిణి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మండంలోని కోలవెన్ను గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కోలవెన్ను గ్రామానికి చెందిన సూరబత్తుల శ్రీలక్ష్మిపై భర్త వెంకటరమణ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆపస్మారక స్థితిలో పడి ఉన్న శ్రీలక్ష్మిని వదిలేసి ఇంటి నుంచి పారిపోయాడు. సమీప బంధువైన ఓ మహిళ ఇంటికి వచ్చి శ్రీలక్ష్మి పిలిచినా పలకపోవటంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగలో పడి ఉండటాన్ని గమనించింది. చుట్టుపక్కల వారిని పిలిచి వారి సహాయంతో శ్రీలక్ష్మిని కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ఆమె బంధువు వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆమె కొడుకుని, మరిదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెంకటరమణ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహ్మద్ షరీఫ్ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
కంకిపాడు, ఫిబ్రవరి 19: విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కొణతనపాడు గ్రామ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఎ సాయిచంద్, అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఫణింద్రతో కలిసి మోటారు బైక్‌పై మచిలీపట్నం వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వీరిద్దరినీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది విజయవాడ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ సాయిచంద్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వివరించారు.