క్రైమ్/లీగల్

రూ.కోటి నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరుకు ఉత్తరం వైపున గల టోల్ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి చెన్నైకు వెళుతున్న ఏపీ 37 బిడబ్ల్యు 4532 నెంబరు గల స్విఫ్ట్ కారులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో స్థానిక ఎస్‌ఐ హజరత్తయ్య అప్రమత్తమై కారును టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేశారు. కారు ఢిక్కీలో సీక్రెట్ లాకర్‌లో కోటి రూపాయల నగదు కనుగొన్నారు. అనంతరం టంగుటూరు డిఎస్‌పి రాధేష్ మురళీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి చెన్నైకు వెళుతున్న కారును టంగుటూరు టోల్ ప్లాజా వద్ద తనిఖీ చేయగా ఆ కారు ఢిక్కీ సీక్రెట్ లాకరులో ఉన్న కోటి రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని కారులో ప్రయాణిస్తున్న ఆనందరావు, రాజేష్‌లను విచారించగా నరసాపురంలోని జయదేవ్ జ్యూయలరీ షాపులో పని చేస్తున్నట్లు, తమ యజమాని ప్రవీణ్‌కుమార్ జైన్ విజయవాడలోని భరత్ అనే వ్యక్తి దగ్గర కోటి రూపాయలు తీసుకొని చెన్నై వెళ్లి బంగారం కొనుగోలు చేయాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. వీరి కారు గుంటూరుకు రాగానే మరలా యజమాని ఫోన్ చేసి నెల్లూరులోని సింహపురి హోటల్ వద్దకు వెళ్లి భాస్కర్ అనే వ్యక్తికి అందించాలని వారు చెప్పినట్లు డిఎస్పీ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును వీఆర్‌ఓల సమక్షంలో లెక్కించగా కోటి రూపాయలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దొరికిన నగదు మనీల్యాండింగ్ ద్వారా హవాల నగదుగా గుర్తించి ఆదాయ పన్ను శాఖకు అందించనున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ తనిఖీలో పాల్గొన్న రైటర్ కోటేశ్వరరావు, పోలీసులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, చలపతిరావు, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.