క్రైమ్/లీగల్

మరోసారి ఈడీ ఎదుట రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఓటు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మంగళవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇవ్వచూపిన కేసులో రేవంత్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. రేవంత్‌ను దాదాపుఆరు గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ నేతను ఈడీ అధికారులు ఆదేశించారు. రూ. 50 లక్షల నగదు పాటు మిగిలిన రూ 4.50 కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారన్న అంశాలపై రేవంత్‌ను ప్రశ్నించారు. స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన నగదు మనీ ల్యాండరింగ్ ద్వారా తరిలించారన్న అభియోగాలపై రేవంత్‌రెడ్డిపై విచారణ జరుగుతోంది. ఏసీబీ అధికారులు ఇచ్చిన ఆధారాలను రేవంత్‌రెడ్డి ముందు ఉంచి ఈడీ విచారిస్తోంది. ఏసీబీ చార్జిషీట్‌లో ఉన్న అంశాలపై ఈడీ జేడీ, డైరెక్టర్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. చార్టెడ్ అకౌంటెంట్లు అందుబాటు ఉంచి మరీ పక్కాగా విచారిస్తున్నారు. రూ. 50 లక్షల నగదు మార్పిడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే రేవంత్‌రెడ్డిని ఐటీ అధికారులు విచారించారు. అలాగే రేవంత్‌రెడ్డి సతీమణితో పాటు మామను సైతం విచారించారు. కేసులో ఉన్న ఉదయసింహను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. 2015మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో పోటీచేశారు. నరేందర్‌రెడ్డి మద్దతుగా ఓటు వేయించడానికి నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ వద్దకు రూ. 50 లక్షలతో రేవంత్‌రెడ్డి వెళ్లారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు మరో నలుగురు వ్యక్తులు స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లారు. ఇలా ఉండగా ఇటీవలే వేం నరేందర్‌రెడ్డితో పాటు ఆయన కుమారులను సైతం ఈడీ అధికారులు విచారించారు. ప్రధానంగా స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారన్నదానిపై అధికారులు విచారించారు. ఈ విచారణలో ఐటీ, బ్యాంక్, ఈడీ అధికారులు పాల్గొన్నారు. బ్యాంకులో లావాదేవీలను లెక్కించిన అధికారులు సైతం ఈడీ అధికారులకు సహాయపడ్డారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ఏ-1గా నిందితుడిగా ఉన్నారు. ఈడీ విచారణ తర్వాత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తమను అణచివేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

చిత్రం.. ఈడీ విచారణ అనంతరం వెలుపలకు వస్తున్న రేవంత్‌రెడ్డి