క్రైమ్/లీగల్

అయోధ్య కేసు విచారణ 26న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్య కేసును ఈ నెల 26న సుప్రీం కోర్టు విచారించనుంది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారిస్తుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులు ఈ ప్రత్యేక బెంచ్‌లో ఉన్నారు. గత నెల 29న విచారణ ప్రారంభించాల్సి ఉండగా, న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే సెలవులో వెళ్లడంతో రద్దయింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్, ఎఎస్ బాబ్డే ధర్మాసనంలో ఉన్నారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన నాలుగు పిటిషన్లను బెంచ్ విచారించనుంది. 2.77 ఎకరాల భూమి మూడు పార్టీలు సున్నీవక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖార, రామ్‌లీలాకు సమానంగా పంచాలని అప్పట్లో హైకోర్టు తీర్పును వెలువరించింది.