క్రైమ్/లీగల్

రూ.453 కోట్లు చెల్లించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పారిశ్రామికవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి బుధవారం సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. నాలుగు వారాల్లోగా ఎరిక్సన్ ఇండియాకు రూ.453 కోట్లు చెల్లించకపోతే మూడు నెలల పాటు జైలుకెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. అనిల్ అంబానీ అహంకారపూరితమయిన వైఖరి కలిగి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనిల్‌తో పాటు ఆర్‌కాంకు చెందిన ఇద్దరు డైరెక్టర్లకు రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. అనిల్ అంబానీ, ఇతరులు కోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించారని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్‌కు రూ.453 కోట్లు చెల్లించాలని తాను జారీ చేసిన ఆదేశాల పట్ల వారు ఉద్దేశపూర్వకంగానే అవిధేయతను ప్రదర్శించారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, ‘సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవిస్తాం. ఆర్‌కాం గ్రూపు ఆ తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటుంది’ అని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిలయన్స్ గ్రూపు ఇది వరకే కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేసిన రూ. 180 కోట్లను ఎరిక్సన్‌కు ఇవ్వడం జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు తీర్పును, కోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించినందున రిలయన్స్ బేషరతు క్షమాపణ చెప్పినా, దానిని తిరస్కరించడం జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎరిక్సన్.. అనిల్ అంబానీ, రిలయన్స్ టెలికం చైర్మన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ చైర్‌పర్సన్ ఛాయా విరానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ తాజా తీర్పు వెలువరించింది.

చిత్రం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీ