క్రైమ్/లీగల్

భార్యను చంపి, ఆత్మహత్యకు భర్త యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్ నగర్, ఫిబ్రవరి 20: కోపంతో భార్యను చంపి, ఓ వ్యక్తి తాను బలవన్మరణానికి యత్నించిన సంఘటన బుధవారం సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి ప్రగతినగర్ కాలనీలో గోపాలచారి (30) భార్య కవిత (25)తో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరగటంతో కోపోద్రిక్తుడైన గోపాలచారి.. కవితను గొంతు నులిమి చంపాడు. భార్యను చంపి బలవన్మరణానికి యత్నించగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాని చేరుకొని, గోపాలచారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.