క్రైమ్/లీగల్

స్నాచింగ్, మోటారు బైక్‌ల చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 20: స్నాచింగ్, మోటారు సైకిళ్ల చోరీ కేసుల్లో నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 16కేసుల్లో నిందితుల నుంచి సుమారు రూ.10లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బీ రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కుని స్నాచింగ్‌లకు పాల్పడిన కేసుల్లో నామాల నాగరాజు (28), కటికల మోహనకృష్ణ (30)లతోపాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన సింగ్‌నగర్‌కు చెందిన మునగాల శ్రీనివాసరావు (30) అరెస్టు చేశారు. వీరి నుంచి పది స్నాచింగ్ కేసుల్లో 256 గ్రాముల 10బంగారు గొలుసులు, ఆరు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కొండపల్లికి చెందిన నామాల నాగరాజు, కటికల మోహనకృష్ణ ఇద్దరూ స్నేహితులు 2017 నుంచి చోరీలకు అలవాటు పడిన క్రమంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ వస్తున్నారు. ఈక్రమంలో సత్యనారాయణపురం, ఇబ్రహీంపట్నం, కంకిపాడు, భవానీపురం, గన్నవరం, మైలవరం, ఆగిరిపల్లి, జి కొండూరు తదితర పోలీస్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడ్డారు.
రాత్రివేళల్లో ఏసీ గోడౌన్ తాళం పగులగొట్టి ఏసీ మిషన్‌లు చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ చెప్పారు. నిందితుల నుంచి రూ.9,72,289 లక్షలు విలువైన 23 ఏసీ మిషన్‌లు స్వాధీనం చేసుకున్నారు. మైలవరానికి చెందిన పొదిలి వీరాస్వామి, తాడేపల్లికి చెందిన ఈడా చరణ్‌తేజ అనే స్నేహితులు ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. కాగా నేరబాట పట్టిన క్రమంలో సూర్యారావుపేట పోలీస్టేషన్ పరలిధిలోని విజయాటాకీసు వెనుక ఉన్న గోడౌన్‌లో 23ఏసీ మిషన్ల చోరీకి పాల్పడ్డారు. ఆయా కేసుల్లో నిందితులను అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసినట్లు డీసీపీ తెలిపారు.