క్రైమ్/లీగల్

జయరాం హత్య కేసు పొలీస్ అధికారుల పాత్రపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఎన్నారై చిగురిపాటి జయరాం హత్య కేసులో పోలీస్ అధికారుల ప్రమేయం ఏమేరకు ఉంది అన్న కోణంలో కేసుపై విచారణ వేగవంతం చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారును బుధవారం బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారించారు. రాకేష్ రెడ్డి, అతని స్నేహితుల మధ్య గొడవ విషయంతోపాటు, ఫోన్ వివరాలు కూడా విచారణ సమయంలో ఏసీపీ మల్లా రెడ్డి తెలిపారని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఈ కేసులో ఇబ్రహీంపట్నం ఎసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాసులు, రాయదుర్గం సీఐ రాంబాబు బుధవారం దర్యాప్తు అధికారుల ముందు హాజరు అయ్యారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి తనతో ఫోన్‌ల్లో మాట్లాడిన విషయం వాస్తవమేనని, అయితే హత్య సంఘటనకు సంబంధించిన విషయాలు తనతో చర్చించలేదిన నల్లకుంట సీఐ చెప్పారని అధికారులు వివరించారు. ఇలావుంటే, విచారణలో ముగ్గరు అధికారులను నాలుగు గంటలకు పైగా దర్యాప్తు అధికారి కేఎస్ రావుప్రశ్నించారు. రాకేష్ రెడ్డితో ముగ్గురు అధికారులకు ఎప్పటి నుంచి పరిచయం ఉందన్న విషయాన్ని రికార్డు చేశారు. జయరాం హత్య తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేశాడు? ఏఏ విషయాలపై మాట్లాడాడు? అతనితో మీకున్న లింకేంటి అన్న ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది. రాకేష్ రెడ్డి చెప్పిన వివరాలు, అధికారులు చెప్పిన అంశాలపై దర్యాప్తు అధికారులు బేరేజు వేస్తున్నారు. కేసులో అధికారుల ప్రమేయం ఉందన్న సమాచారం తెలిస్తే, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు సమాచారం. నిందితుడు రాకేష్ రెడ్డి కారులో జయరాం శవాన్ని తరలించే సమయంలో ఎవరెవరికి ఏన్ని ఫోన్ కాల్స్ చేశాడో ఆ వివరాలను రికార్డు చేశారు. జయరాం హత్య తర్వాత రాకేష్ రెడ్డి పలువురు రాజకీయ నాయకులతో ఫోన్‌లో మాట్లాడినట్లు వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ, విచారణకు ఎవరు అవసరమో వారికి సమాచారం ఇస్తామని దర్యాప్తు అధికారులు వ్యాఖ్యానించారు. ఈకేసులో శిఖా చౌదరికి జయరాంకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తమకు పక్కా సమాచారం ఉందని దర్యాప్తు అధికారి ఒకరు స్పష్టం చేశారు. జయరాం హత్య తర్వాత ముందు రాజకీయ నేతలకు రాకేష్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు.