క్రైమ్/లీగల్

యువతి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఫిబ్రవరి 21: గుంటూరు జిల్లా తెనాలి పట్టణం సాలిపేటలో ఓ యువతి తండ్రి వయస్సున్న వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం భట్టిప్రోలుకు చెందిన బిట్ర సుధాకర్, అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ 20 సంవత్సరాలుగా స్నేహితులు. వీరి స్నేహం వ్యాపారం వరకు కొనసాగి సుధాకర్ చిరు వ్యాపారిగా, సత్యనారాయణ వడ్డీ వ్యాపారిగా తెనాలిలోని సాలిపేటలో కుటుంబ సభ్యులతో స్థిరపడ్డారు. సత్యనారాయణకు భార్య, సుమారు 19 సంవత్సరాల వయస్సున్న కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా వారు సత్యనారాయణకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎక్కువ సమయం సుధాకర్ ఇంటిలోనే గడుపుతూ కాలక్షేపం చేస్తూ వస్తున్న 45 సంవత్సరాల సత్యనారాయణ 10వ తరగతి వరకు చదువుకున్న సుధాకర్ కుమార్తె జ్యోతి (19)తో సంబంధం పెట్టుకున్నాడు. విషయం జ్యోతి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కథ నడుపుతున్నాడు. ఈ క్రమంలో జ్యోతికి పెళ్లి చేయాలనే సంకల్పంతో వరుడ్ని వెతికేందుకు ఆమె తల్లిదండ్రులు గురువారం ఏలూరులోని తమ బంధువుల ఇంటికి వెళ్ళారు. విషయం తెలుసుకున్న సత్యనారాయణ రోజూ మాదిరిగానే సుధాకర్ ఇంటికి వెళ్ళి జ్యోతి ద్వారా విషయం తెలుసుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గాని తాను జ్యోతిని హత్య చేసినట్లు సత్యనారాయణ బయటకు వచ్చి కేకలు వేయటంతో సమీప ప్రజలు గుమిగూడారు. గొంతు, నోటిలో కత్తి గాట్లతో రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉన్న జ్యోతిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తెనాలి డిఎస్పీ ఎం స్నేహిత, 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ అనిల్‌కుమార్ హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని ఏలూరులో ఉన్న జ్యోతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు హడావిడిగా వచ్చి రక్తపు మడుగులో మృతి చెంది పడి ఉన్న కూతుర్ని చూసి బోరున విలపించారు. తన కుమార్తెకు, సత్యనారాయణకు లైంగిక సంబంధం ఉందన్న విషయం తమకు తెలియదని, అతడు 20 సంవత్సరాలుగా తన స్నేహితుడని, తనకు కూడా జ్యోతితో సమాన వయసున్న కుమారుడు ఉన్నట్లు జ్యోతి తండ్రి సుధాకర్ తెలిపాడు. జ్యోతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉండగా తానే జ్యోతిని హత్య చేసినట్లు సత్యనారాయణ ఒప్పుకుంటూ 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. తండ్రి వయస్సున్న వ్యక్తి నమ్మించి యువతిని హత్య చేయటం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది.