క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 21: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్‌లోని హాస్టల్ ఉంటూ మేడిపల్లి పరిధిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన ఫైళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె దివ్యా రెడ్డి(20) బుధవారం రాత్రి అఫెక్స్ ఆసుపత్రి వెనుక నవీన్ ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుందని ఇన్‌స్పెక్టర్ అంజి రెడ్డి తెలిపారు.

గుట్కా విక్రయాలపై పోలీసుల కొరడా
తాండూరు, ఫిబ్రవరి 21: తాండూరు పట్టణంలో ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్ మసాలాల విక్రయ దారులపై పట్టణ పోలీసులు గత రెండు రోజులుగా దాడులు జరిపి భారీ స్థాయిలో నిషేధిత గుట్కా, పాన్ మసాలాలను పట్టుకుంటున్నారు. బుధ,గురువారాలు రెండు రోజులు పట్టణ పోలీసులు జరుపుతున్న దాడులలో లక్షలాది రూపాయలు విలువైన గుట్కా, పాన్ మసాలా ప్యాకేట్లను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో గాంధీ చౌక్ ప్రాంతంలో ఉన్న బాలాజీ పాన్‌షాప్, ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ఉన్న అబ్దూల్ వసీయ్, అబ్దూల్ సత్తార్ పాన్ షాప్‌లతో పాటు, పట్టణంలోని పలు ప్రాంతాలలో నిషేధిత గుట్కా, పాన్ మసాలాలు విక్రయిస్తున్న వ్యాపారులపై పోలీసులు కోరఢా ఝూళిపిస్తున్నారు. పట్టణ పరిసరాల ప్రజలు సైతం తమ ఏరియాల్లో ఎక్కడా అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్న వెంటనే స్థానిక పోలీసులకు రహస్య సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని పోలీస్ అధికారులు ప్రజలకు విన్నవిస్తున్నారు.