క్రైమ్/లీగల్

వైద్య, ఆరోగ్య శాఖలో భారీ అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 21: వైద్య ఆరోగ్య శాఖలో భారీ అవినీతి చోటు చేసుకుందంటూ గతంలో హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం వాదనలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిల్‌పై హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దర్యాప్తుకు సంబంధించి ఏసీబీ హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే గురువారం కేసుకు సంబంధించి వాదనల నేపధ్యంలో ఏసీబీ విచారణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖలో భారీ స్కాం జరిగిందంటూ ఇందుకూరి వెంకట రామరాజు అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దాదాపు రూ.230కోట్ల మేర వైద్య పరికరాలు, సేవల నిర్వహణలో అవినీతి జరిగిందని గత ఏడాది 2018 జూలై 26న హైకోర్టులో పిటిషనర్ పిల్ వేశారు. దీనిపై విచారణ జరపాలని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. అయితే విచారణకు సంబంధించి ఏసీబీ తన నివేదికను గురువారం హైకోర్టులో సమర్పించాల్సి ఉండగా ఇదే సమయంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకున్నారు. 2018 జూలై 26 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఏసీబీ విచారణ జరగకూడదంటూ అభ్యంతరాలు తెలిపారు. దీంతో గెజిట్ నోటిఫికేషన్‌పై వచ్చే నెల 14న వాదనలు వినిపించాలని న్యాయస్థానం పిటిషనర్‌ను సూచించింది. అదేవిధంగా పిటిషనర్ ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో అధిక మొత్తాలకు టెండర్లు ఇచ్చిన సంస్థ నుంచి రూ.24కోట్ల జరిమానా రూపంలో వసూలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది.