క్రైమ్/లీగల్

వరవరరావుపై చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: మహారాష్ట్ర పూణె పోలీసులు విరసం నేత వరవరరావుపై చార్జిషీట్ దాఖలు చేశారు. బీమా కోరేగావ్ కేసులో అర్బన్ నక్సల్స్‌పై 1,837 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు. బీమా కోరేగావ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగాలపై వరవరరావుసహా పలువురు హక్కుల కార్యకర్తలను గత ఏడాది పూణె పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మావోయిస్టులతో విప్లవ సంఘాల నేతలకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టుల లేఖ ఆధారంగానే అర్బన్ నక్సల్స్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా, అకారణంగా తమను అరెస్టు చేశారని, ఆ లేఖ కల్పితమని వరవరరావు ఆరోపించారు.