క్రైమ్/లీగల్

భివానీ ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 21: కాన్పూర్‌లో భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన పేలుళ్లకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫరూఖాబాద్ స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్‌పీ) గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కాన్పూర్-్భవానీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కంపార్ట్‌మెంట్‌లోని వాష్‌రూమ్ వద్ద పేలుళ్ల సంభవించాయి. రైలు బర్రాజ్‌పూర్ వద్ద ఆగిన సమయంలో బుధవారం సాయంత్రం 7.10 గంటలకు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. భారతీ రైల్వేల చట్టంలోని 151 సెక్షన్, ఐపీసీలోని 286 పేలుళ్ల చట్టం కింద ఫరూఖాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్టు ఆర్‌పీఎఫ్ డీజీపీ పీఆర్‌వో ఆర్కే గౌతమ్ వెల్లడించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సామగ్రిని సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ (కాన్పూర్ జోన్) అవినాష్ చంద్ర వెల్లడించారు. చేతిరాతతో ఉన్న కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.