క్రైమ్/లీగల్

రివ్యూ పిటిషన్లను విచారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేసులో తాను ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లను విచారిస్తానని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. భారత్, ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు జరిగిన ఒప్పందాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం నిరుడు డిసెంబర్ 14న తీర్పు ఇచ్చింది. రూ. 58వేల కోట్ల రాఫెల్ ఒప్పందంపై జ్యుడీషియల్ స్క్రూటినీ జరపాలని, కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరితో పాటు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఒప్పందంలో నిర్ణయం తీసుకోవడాన్ని నిజంగా సందేహించాల్సిన కారణం కనిపించడం లేదని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. అయితే, ఈ కేసులో గత విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడానికి అసత్యాలు చెప్పిన కొంతమంది ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ విడిగా దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు తన రివ్యూ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ‘మేము ఈ అంశంపై నాలుగు పిటిషన్లు ఉన్నట్టు భావిస్తున్నాం. ఒకటి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసింది.. కొన్ని పిటిషన్లు (లోపభూయిష్టమయినవి) రిజిస్ట్రి వద్ద పడి ఉన్నాయి’ అని న్యాయమూర్తులు ఎల్.నాగేశ్వరరావు, సంజీవ్ ఖన్నాలు సభ్యులుగా గల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘్ధర్మాసనంలోని న్యాయమూర్తుల కూర్పును మార్చవలసి ఉంది. ఇది చాలా కష్టమయినది. మేము దీనికోసం ఏదోఒకటి చేస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది. డిసెంబర్ 14నాటి తీర్పును ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం వెలువరించింది. ఈ ఇద్దరు న్యాయమూర్తులు ప్రస్తు తం వివిధ ధర్మాసనాలలో సభ్యులుగా ఉన్నారు.