క్రైమ్/లీగల్

జయరాం హత్యకేసులో ముగియనున్న కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాకేష్‌రెడ్డి, డ్రైవర్ శ్రీనివాస్ పోలీసు కస్టడీ శనివారంతో ముగియనుంది. సూత్రధారి రాకేష్‌రెడ్డి పూటకోమాట చెబుతుండడంతో మరింత సమాచారం రాబట్టడానికి 8 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో జయ రాం హత్యకు 48 గంటలు ముందు, తర్వాత రాకేష్‌రెడ్డి ఎవరెవరితో మాట్లాడింది ఫోన్‌కాల్స్ డేటా ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీ నటు డు సూర్యను పోలీసులు అరెస్టు చేశారు. రౌడీ షీటర్ నగశ్‌తో పాటు విశాల్‌ను కూడా అరె స్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో 64మందిని విచారించారు. రాకేష్‌రెడ్డికి సహాయపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను సైతం విచారణ కోసం జూబ్లీస్టేషన్‌కు పిలిపించా రు. ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్, రాంప్రసాద్‌ను మరోసారి విచారించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈనెల 23తో జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి, డ్రైవర్ శ్రీనివాస్‌కు పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ కేసులో రాజకీయ నేతలు అరెస్టులు ఉండవచ్చునని తెలుస్తోంది.